అమ్మ నుంచే నగ్నంగా పోజులివ్వడం నేర్చుకున్నా!

41407581234_625x300లాస్ ఏంజెల్స్: కొందరు నటులు, గాయనులు నిండు గర్భంతో ఉన్నప్పుడు నగ్నంగా ఫొటోలకు  పోజులిచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. టీవీ నటి కోట్నీ కర్దాషియన్, ఆమె తల్లి క్రిస్ జెన్నర్ ఇద్దరూ ఇలాంటి ఫొటోలు దిగారు. నగ్నంగా ఫొటోకు పోజులివ్వడం ఎలాగో అమ్మను చూసి అనుకరించానని కర్దాషియన్ చెబుతోంది.

2009తో కర్దాషియన్ తొలి బిడ్డకు జన్మ ఇచ్చే ముందు నగ్నంగా ఫొటోకు పోజులిచ్చింది. కర్దాషియన్ తాజాగా బాయ్ఫ్రెండ్ స్కాట్ డిసిక్ ద్వారా మూడో బిడ్డకు త్వరలో జన్మనివ్వనుంది. గతంలో తల్లి నగ్నంగా దిగిన ఫొటో పక్కన, కర్దాషియన్ తన ఫొటోను ఉంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మ నుంచే నేర్చుకున్నా అని ఫొటో కింద రాసింది. 1987లో జెన్పర్ కూడా కొడుకు రాబ్కు జన్మ ఇచ్చేముందు నగ్నంగా పోజు ఇచ్చింది. రాబ్ 25 వ పుట్టిన రోజు సందర్భంగా 2012లో జెన్నర్ తన బ్లాగ్లో ఆ ఫొటోను పోస్ట్ చేసింది