ఆ నిర్ణయం మంచిదే

images (5)ఆలీఘడ్: ‘లవ్ జిహాద్’పై దేవ్‌బండ్ ఇస్లామిక్ శిక్షణ సంస్థ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ముస్లిం మతాధికారులు, మేధావులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. అరుదుగా జరిగే మతాంతర వివాహాల విషయంలో అతిగా ప్రచారం చేస్తూ మత రాజకీయాల వలలో పడవద్దని ప్రసార మాధ్యమాలకూ వారు విజ్ఞప్తి చేశారు. ఒక ముస్లిం యువకుడు వేరే మతానికి చెందిన యువతిని వివాహమాడి, తప్పుడు విధానాల ద్వారా ఆమె చేత మతమార్పిడి చేయించాలని ప్రయత్నిస్తే ఆ వివాహం న్యాయసమ్మతం కాదని దేవ్‌బండ్ శిక్షణ సంస్థ స్పష్టం చేసింది.

Leave a Comment