స్వర్ణమే నా లక్ష్యం

images (9)న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో స్వర్ణమే తన లక్ష్యమని ఐదుసార్లు ప్రపంచ బాకింగ్ ఛాంపియన్ మేరీకోమ్ చెప్పింది. ”ఇప్పటివరకు మా సన్నాహకం బాగుంది. ఆసియా క్రీడల కోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్నాం. పసిడి పతకమే నా లక్ష్యం. ఈసారి కాంస్యం సరిపోదు” అని మేరీ వ్యాఖ్యానించింది. ఓ యువ శిక్షణ కేంద్రం ప్రారంభం సందర్భంగా మేరీ మాట్లాడింది. బాక్సర్ విజేందర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నాడు. మరిన్ని యువ శిక్షణ కేంద్రాలు అవసరమని అతడు అభిప్రాయపడ్డాడు.

Leave a Comment