హమ్మయ్య.. సాధించేశా: ప్రియాంకా చోప్రా

images (3)‘హమ్మయ్య.. సాధించేశాను.. మోరీకోమ్‌ పాత్రలో నటించి ప్రేక్షకుల మన్నన పొందుతున్నాను నా జీవితంలో ఇంత గొప్ప ఆనందకరమైన విషయం ఇంకోటి లేదు..’ అంటూ పట్టలేని సంతోషంతో కన్పిస్తోంది బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఎన్నో సినిమాల్లో నటించినా ‘మేరీకోమ్‌’ సినిమా కోసం ఎదురుచూసినంత టెన్షన్‌ ఇంకే సినిమా విషయంలోనూ జరగలేదని ప్రియాంకా చెప్పుకొచ్చింది. ‘‘సినిమా ఏ రేంజ్‌ కమర్షియల్‌ విజయం సాధిస్తుందన్నది నిర్మాతకు సంబంధించిన విషయం. ఆ లెక్కల్ని నేను పట్టించుకోను. ఖచ్చితంగా కమర్షియల్‌గా మంచి విజయమే సాధిస్తుంది. కానీ, విమర్శకుల ప్రశంసలు అందుకోవడం నటిగా నేను సాధించిన గొప్ప విజయం..’’ అంటోంది ప్రియాంకా చోప్రా. బాక్సర్‌ మేరీ కోమ్‌ బయోపిక్‌ అయిన ‘మేరీకోమ్‌’ కోసం ప్రియాంక చాలా కష్టపడింది. మగరాయుడిలా కండలు తిప్పిన శరీరాన్ని సొంతం చేసుకుంది. బాక్సింగ్‌లో దెబ్బలు కూడా తినేసింది ప్రాక్టీస్‌ చేస్తూ. ఎలాగైతేనేం.. ప్రియాంక ఖాతాలో మరో విజయం మామూలే అయినా, ఆమె కెరీర్‌లో అద్భుతమైన గొప్ప సినిమా ఆమె చేసిందన్న కీర్తి మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు కదా.

Leave a Comment