సిమన్స్ వీరవిహారం

downloadఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్‌లో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో సదర్న్ ఎక్స్‌ప్రెస్‌ను చిత్తుగా ఓడించింది. సిమన్స్ (76 నాటౌట్; 51 బంతుల్లో 11X4, 1X6), మైకెల్ హసి (60; 40 బంతుల్లో 5X4, 3X6) రెచ్చిపోవడంతో 162 పరుగుల లక్ష్యాన్ని ముంబయి 16.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. బౌండరీల మోత మోగించిన సిమన్స్-హసి తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించారు. పొలార్డ్ 20 (7 బంతుల్లో 3X6) పరుగులతో అజేయంగా నిలిచాడు. మహరూఫ్ (41 నాటౌట్; 22 బంతుల్లో 3X4, 2X6), గుణతిలక (30; 23 బంతుల్లో 3X4, 1X6) చెలరేగడంతో మొదట సదర్న్ జట్టు 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబయి ఈ గెలుపుతో ప్రధాన రౌండ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సదర్న్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో నార్తర్న్‌తో ముంబయి, సదర్న్‌తో లాహోర్ లయన్స్ తలపడతాయి. ప్రధాన రౌండ్‌కు చేరే రెండు జట్లేవో ఆ రోజే తేలుతుంది.

Leave a Comment