ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఉభయ రాష్ట్రాల్లో వైద్య, దంత డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ శనివారం నుంచి అయిదు రోజులపాటు జరగనుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని సీట్లతో పాటు, మిగిలిన సీట్లను కలిపి కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అయిదు ఆన్‌లైన్ కేంద్రాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు మొత్తం 5 ఎంబీబీఎస్, 349 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల కౌన్సెలింగ్‌ను శుక్రవారం చేపట్టి మిగిలిన సీట్లను ఆయా రిజర్వేషన్ కేటగిరీలకు మళ్లిస్తారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ కేంద్రంలో జరిగే ప్రత్యేక కేటగిరీ విభాగంలో ఎన్‌సీసీ కేటగిరీ (354 మంది), ఆర్మీ సంతతి అభ్యర్థుల (309 మంది) కుల, విద్యా. ఇతర ధ్రువీకరణ పత్రాలను పరిశీలన చేయించుకోగా ప్రాధాన్య క్రమాన్ని ఇప్పటికే వెల్లడించారు. వీరికి 1శాతం సీట్లకుగాను 46 ఎంబీబీఎస్, 11 బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉంచారు. వికలాంగుల విభాగంలో 3 శాతం రిజర్వేషన్‌కు 133 ఎంబీబీఎస్, 42 బీడీఎస్ సీట్లు ఉండగా కేవలం 21మంది అభ్యర్థులే కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. పోలీసుల సంతతి విభాగానికి 0.25 శాతం సీట్లుండగా 7 ఎంబీబీఎస్, రెండు బీడీఎస్ సీట్లుండగా.. ముగ్గురు అభ్యర్థులే కౌన్సెలింగ్ అర్హత పొందారు.
Recent Comments