మైక్రోసాఫ్ట్ నుంచి 18వేల మందికి ఉద్వాసన!

81383594021_625x300న్యూఢిల్లీ : సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు దుర్వార్త. 2015 నాటికల్లా దాదాపు 18 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. వీళ్లలో 12,500 మంది నోకియా పరికరాలకు సంబంధించిన వాళ్లు. వీళ్లందరికీ త్వరలోనే పింక్స్లిప్పులు అందుతాయి. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మొత్తం ఉద్యోగులందరికీ లేఖలు పంపారు. మొత్తం ఉద్యోగులను సరిచేసుకుని, ఉత్పాదకత సాధించే దిశగా వెళ్లడంలో భాగమే ఈ కోతలని అందులో ఆయన తెలిపారు. ముందుగా 13 వేల మందిని తగ్గించుకుంటున్నామని, వాళ్లకు రాబోయే ఆరు నెలల్లో విషయం తెలియజేస్తామని అన్నారుఅయితే..    ఉద్యోగులను తొలగించే విధానం మాత్రం చాలా పారదర్శకంగా సాగుతుందని నాదెళ్ల తెలిపారు.ఇలా ఉద్యోగాలు కోల్పోయేవారికి జాబ్ ట్రాన్సిషన్ అసిస్టెన్స్ పేరుతో కొంతకాలం పాటు సాయం కూడా అందిస్తామని ఆయన అన్నారు. నోకియా పరికరాలు, సేవల బృందాలను పూర్తిగా మైక్రోసాఫ్ట్లో కలిపేందుకు కంపెనీ యోచిస్తోందని చెప్పారు. నోకియా ఎక్స్ ఉత్పత్తులు కూడా లూమియా ఉత్పత్తుల లాగే విండోస్ మీద నడిచేలా డిజైన్ మార్చాలనే ఆలోచన కనిపిస్తోంది. దీంతో నోకియా ఎక్స్ ఫోన్లు ఇక ఆండ్రాయిడ్ ప్లాట్ఫాం మీద రాబోవన్న మాట

Leave a Comment