ముంబయి ఔట్

images (1)రాయ్‌పూర్: ముంబయి ఇండియన్స్ కథ ముగిసింది. ఛాంపియన్స్ లీగ్ నుంచి క్వాలిఫయర్స్ దశలోనే ఆ జట్టు నిష్క్రమించింది. మంగళవారం జరిగిన చివరి అర్హత మ్యాచ్‌లో నార్తర్న్ నైట్స్ 6 వికెట్ల తేడాతో ముంబయిని మట్టికరిపించి ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించింది. నైట్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలవగా.. లాహోర్ లయన్స్ రెండు విజయాలతో రెండో స్థానంతో ముందంజ వేసింది. ఒకే విజయంతో ముంబయి, అసలు ఖాతానే తెరవకుండా సదరన్ ఎక్స్‌ప్రెస్ వెనుదిరిగాయి. నైట్స్‌తో మ్యాచ్‌లో ముంబయి ప్రదర్శన పేలవం. అన్ని విభాగాల్లోనూ ఘోరంగా విఫలమైంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి.. నైట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల కోసం చెమటోడ్చింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. 31 (24 బంతుల్లో 2X4, 1X6) పరుగులు చేసిన పొలార్డే టాప్ స్కోరర్. గోపాల్ 24, మలింగ 20 పరుగులు చేశారు. సౌథీ (3/24), స్త్టెరిస్ (3/21) ముంబయిని దెబ్బతీశారు. ఓపెనర్లు విలియమ్సన్ (53; 36 బంతుల్లో 7X4, 1X6) డెవిసిచ్ (39; 34 బంతుల్లో 4X4, 1X6), మెరవడంతో లక్ష్యాన్ని నైట్స్… 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: 132/9 (సిమన్స్ 13, మైకెల్ హసి 7, జలజ్ సక్సేనా 10, రాయుడు 6, తారె 7, పొలార్డ్ 31, హర్భజన్ 10, గోపాల్ 24, మలింగ 20; సౌథీ 3/24, స్త్టెరిస్ 3/21)

నార్తర్న్ నైట్స్ ఇన్నింగ్స్: 133/4 (డెవిసిచ్ 39, విలియమ్సన్ 53, ఫ్లిన్ 13, వాట్లింగ్ 0, మిచెల్ నాటౌట్ 16, స్త్టెరిస్ నాటౌట్ 3; బుమ్రా 2/26)

Leave a Comment