మోడల్పై డీఐజీ అత్యాచారం … కేసు నమోదు

51406200978_625x300ముంబై: తనపై ఐపీఎస్ అధికారి, డీఐజీ సునీల్ పరస్కర్ అత్యాచారం చేశారని ముంబైకి చెందిన ఓ మోడల్ నగర పోలీసులను ఆశ్రయించింది. దాంతో సునీల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ లోకరి గురువారం ముంబైలో వెల్లడించారు. గతంలో కూడా చాలా సార్లు తనపై సునీల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు.

నగర శివారులలోని ఓ హోటల్లో సునీల్ తనపై వ్యవహారించిన తీరును కూడా ఆ ఫిర్యాదులో మోడల్ వివరించిందని రమేష్ చెప్పారు. ఐపీఎస్ అధికారి సునీల్ గత కొద్ది కాలం క్రితం వరకు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( ఉత్తర ప్రాంతం)గా పని చేసే వారని తెలిపారు. ప్రస్తుతం  ప్రోటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యూనిట్స్ డిఐజీగా సునీల్ విధులు నిర్వర్తిస్తున్నారని రమేష్ చెప్పారు.

Leave a Comment