మా అబ్బాయి రేప్ చేశాడు.. తల్లి ఫిర్యాదు

61409899100_625x300కానింగ్: పిల్లలను సరైన మార్గంలో నడిపించడమే కాదు దారి తప్పితే దండించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉంది.. తమ వారైనా పరాయివారైన ఎవరు చేసినా తప్పు తప్పే.. నేరం చేసిన కొడుకును ఓ తల్లి అరెస్ట్ చేయించి ఆదర్శంగా నిలిచింది.  వివరాలిలా ఉన్నాయి.

పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24- పర్గానాస్ జిల్లాలో డైమండ్ హార్బర్ వద్ద నాజిర్ షేక్ అనే యువకుడు మరో ముగ్గురితో కలసి ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. స్కూల్లో టాయ్లెట్ మూసివేయడంతో ఒకటో తరగతి విద్యార్థిని బయటకు వెళ్లింది. ఆ సమయంలో నాజిర్ గ్యాంగ్ ఆ చిన్నారిని పొదలచాటుకు లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు అపస్మారక స్థితిలో అక్కడే ఉండిపోయింది.

అనంతరం ఇంటికెళ్లిన నాజిర్ మద్యం మత్తులో అత్యాచారం విషయం గురించి మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన వెంటనే నాజిర్ తల్లి అనిర్ బీబీ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లింది. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించింది. ఆ తర్వాత తన కొడుకుపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాజిర్ను అరెస్ట్ చేశారు.

Leave a Comment