మా అమ్మ నన్ను చంపాలనుకుంది

61405756464_625x300రొనాల్డో… ప్రపంచ ఫుట్ బాల్ ఫ్యాన్స్ అందరూ రొనాల్డో అంటే పడిచస్తారు. కానీ రొనాల్డో తల్లి మాత్రం ఆ బిడ్డ వద్దనుకుంది. వదిలించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. గర్భస్రావం చేయించుకునేందుకు ప్రయత్నించింది. చివరికి భారీ వ్యాయామాలు చేసి, వేడి ఆల్కహాల్ తాగి గర్భం పోగొట్టుకునేందుకు ప్రయత్నించింది.

కానీ రియల్ మాడ్రిడ్ ఆటగాడైన రొనాల్డో మహా గట్టిపిండం. ఇంత చేసినా గర్భస్రావం జరగలేదు. వదిలించుకోవాలని విదిలించుకున్నా అతను తల్లి గర్భాన్ని వదల్లేదు గాక వదల్లేదు. అలా పోరాటం చేయడం, పోరాడి గెలవడం రొనాల్డోకి చిన్నప్పుడే అలవాటైపోయిందని తల్లి డోలోరెస్ అవియెరో అంటున్నారు రొనాల్డో తల్లి తన జీవిత గాథను మదర్ కరేజ్ అన్న పేరిట పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకంలోనే ఈ సంఘటనను ఆమె రాసింది.

పుట్టకముందే బిడ్డను తాను చంపాలనుకున్న విషయం తాను రోనాల్డోకి చెప్పానని, అప్పుడప్పుడూ అతను తనను ఈ విషయంలో ఆటపట్టిస్తూంటాడని కూడా తల్లి తన ఆత్మకథలో రాసింది. ఆ తల్లి ప్రయత్నాలు విఫలం కావడం వల్లే మనకి రొనాల్డో వంటి అద్భుతమైన ఫుట్ బాల్ ఆటగాడు దొరికాడు.

Leave a Comment