కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ముమైత్‌ ఖాన్‌ ఆల్బమ్

41407422838_625x300ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్‌  కుర్రకారుకు పిచ్చెక్కించేవిధంగా  ఆల్బమ్ రూపొందించారు.  ఆ ఆల్బమ్ జనం ముందుకు వచ్చేసింది. ముమైత్‌ ఖాన్‌ను ప్రేక్షకులు మరచిపోకపోయినా, దర్శక, నిర్మాతలు మాత్రం మరచిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ దర్శక,నిర్మాత డ్యాన్స్ గర్ల్కు అవకాశం ఇవ్వడంలేదు. గత కొద్దికాలంగా ముమైత్ ఏ చిత్రంలో నటించలేదు. ఈ పరిస్థితులలో అందరికీ మతిపోయేవిధంగా తన ఆల్బమ్తో అదరగొడుతోంది. తన అందచందాలు – హావభావాలు – చిలిపి చూపులు – కుర్రకారుని రెచ్చగొట్టే డ్యాన్సలతోపాటు తన సెక్సీ వాయిస్‌తో ఈ ఆల్బమ్ను విడుదల చేసింది. ఇంకేముంది కుర్రకారు మరింత కిర్రెక్కిపోతున్నారు.

ముమైత్‌ ఖాన్ పేరు చెప్పగానే మనకు  దాదాపు ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ – మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’ సినిమాలోని ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాట గుర్తొస్తుంది. పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో ఈ పాట కూడా అదే స్థాయిలో జనాన్ని ఉర్రూతలూగించింది. దీంతో ముమైత్‌ ఖాన్‌ రేంజి రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది.  

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో  ఈ ముద్దుగుమ్మ దుమ్ము రేపేసింది. ఎంత పదారేళ్ల వయసు అయినా, కొంత కాలానికి మొహం మొత్తుతుంది కదా!. అలా ముమైత్‌ తెర వెనక్కు పోయింది. అయినప్పటికీ నిరుత్సాహ పడటం లేదు. ముమైత్లో యాక్టివ్నెస్ గానీ, ఆ ఊపుగానీ  ఏమీ తగ్గలేదు.  ఇప్పుడు కొత్త అవతారంలో జనం ముందుకొచ్చింది. అడిక్షన్‌ పేరుతో ఓ పాట పాడి ఆల్బమ్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. నాలుగు నిమిషాల ఈ ఆల్బమ్లో మళ్లీ తన సత్తా చూపింది. దీంతో మళ్లీ తనకు ఆఫర్లు వస్తాయనే ఆశతో ముమైత్‌ ఖాన్‌ ఉంది. ఆమె ఆశ నెరవేరాలని ఆశిద్ధాం.