మా నాన్నే ఆత్మకథ రాయాలి

61407617727_625x300మన్మోహన్ కుమార్తె  వ్యాఖ్య

 న్యూఢిల్లీ: 50 ఏళ్లు దేశానికి సేవలందించిన తన తండ్రే తన ఆత్మకథను రాస్తే బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కుమార్తె దమన్‌సింగ్ అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రుల ఆత్మకథకు ఆమె అక్షర రూపమిచ్చారు. ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ పేరుతో రచించిన ఈ పుస్తకం ఆదివారం విడుదల కానుంది.

అయితే మన్మోహన్ ప్రధానిగా ఉన్న పదేళ్ల కాలం గురించి ఇందులో ప్రస్తావించలేదు. పుస్తకం విడుదల సందర్భంగా  దమన్ శనివారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు.  ప్రధాని పదవిని చేపట్టేందుకు సోనియా విముఖత వ్యక్తం చేసి మన్మోహన్‌ను ఆ పదవికి సూచించినప్పుడు ఆయన ఎలా స్పందించారని ప్రశ్నించగా దాన్ని స్వీకరించడం గొప్ప గౌరవంగా భావించారన్నారు.