సమంత, తమన్నా కంటే కేసీఆర్ అందంగా…: వర్మ

61402484595_625x300హైదరాబాద్: నా తదుపరి చిత్రం టైటిల్ కేసీఆర్ అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. కేసీఆర్ అనే పదం ఎన్ టీఆర్ అనే పదం కంటే వినడానికి బాగుందని వర్మ మరో ట్విట్ లో పేర్కొన్నారు.
ఆధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్ ను అందగాడిని చేశాయి అన్నారు. ఇంకా ఒక అడుగు ముందేసి  సమంత, తమన్నా, ఇలియానాలు కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందని వర్మ ట్వీట్ తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్.. కాని కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేశారు.