పెళ్లా.. పదేళ్ల తర్వాత అడగండి…

51407785186_625x300పెళ్లి గురించి తనను ఇప్పుడప్పుడే అడగొద్దని, పదేళ్ల తర్వాత అడగండని అంటోంది బాలీవుడ్ భామ ఈషా గుప్తా. ఢిల్లీలో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమెను మీడియా ప్రతినిధులు పెళ్లెప్పుడని ప్రశ్నిస్తే, మరో పదేళ్లయ్యాక గానీ పెళ్లి విషయమై నిర్ణయం తీసుకోలేనని, తన కంటే ముందుగా తన అక్క నేహాకు పెళ్లి జరగాలని కోరుకుంటున్నానని చెప్పింది.

దేశభక్తి సినిమా చేయాలని ఉంది…

యువనటుడు అర్జున్ కపూర్ దేశభక్తి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. సాధారణంగా వినిపించే జాతీయగీతం ప్రజలను స్పందింపజేయడం అనిర్వచనీయంగా ఉంటుందని, త్వరలోనే ఒక దేశభక్తి సినిమా చేయాలనుకుంటున్నానని అతడు ‘ట్విట్టర్’ ద్వారా తన ఆసక్తిని బయటపెట్టాడు.

భారతీయ ఆభరణాలంటే ఇష్టం…

భారత్‌లో పుట్టి పెరగకపోయినా, తనకు భారతీయ ఆభరణాలంటేనే ఇష్టమని అంటోంది నర్గీస్ ఫక్రీ. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక ఫ్యాషన్ వీక్‌లో సంప్రదాయ భారతీయ ఆభరణాలతో ఆమె ర్యాంప్ వాక్ చేసింది. తాను చాలా తక్కువగా నగలు ధరిస్తానని, అయితే, భారతీయ ఆభరణాల డిజైన్లను ఎక్కువగా  ఇష్టపడతానని నర్గీస్ ఫక్రీ  చెబుతోంది.