నమన్ సెంచరీల హ్యాట్రిక్

51405454048_625x300వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో శతకం  
 భారత్ ‘ఎ’కు ఆధిక్యం
 
 బ్రిస్బేన్: సెలక్టర్లను ఆకట్టుకునేందుకు అందివచ్చిన అవకాశాన్ని వికెట్ కీపర్ నమన్ ఓజా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’  పై వరుసగా మూడో సెంచరీని సాధించాడు. భారత్ ‘ఎ’కు ఆధిక్యాన్ని అందించాడు. నమన్ ఓజా బ్యాటింగ్ ప్రతిభతో… ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లోనూ భారత్ ‘ఎ’ భారీ స్కోరు కూడగట్టుకుంది. ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’ దిశగా సాగుతోంది.
 
 మ్యాచ్ మూడో రోజు మంగళవారం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 501 పరుగులకు ఆలౌటైంది. దీంతో 78 పరుగుల ఆధిక్యం లభించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న నమన్ ఓజా (134 బంతుల్లో 110; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) ఈ సిరీస్‌లో వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో శతకం సాధించడం విశేషం. మరోవైపు ఉమేశ్ యాదవ్ (66 బంతుల్లో 90; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) తృటిలో సెంచరీని కోల్పోయాడు. అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బంతిని ఎదుర్కోగానే వెలుతురులేమితో మ్యాచ్‌ను నిలిపేశారు.

Leave a Comment