మోడీ వ్యాఖ్యలు.. రాజకీయ లబ్ధికోసం కాదు

download (2)న్యూఢిల్లీ : భారత ముస్లింలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేసిన వ్యాఖ్యలు కావంటూ భాజపా శనివారం తెలిపింది. మోడీ వ్యాఖ్యల్లో వెతుకుతున్న వ్యతిరేక అర్థాలను బలంగా తిప్పికొట్టింది. ఓట్లను సాధించి పెట్టడానికి సెక్యులరిజం ఎల్లప్పుడూ పనిచేయదంటూ వారు గుర్తించాలని పేర్కొంది. అవి జాతీయభావం పెంపొందించడానికి చేసిన వ్యాఖ్యలని చెప్పింది. మోడీ ఈ వ్యాఖ్యలు.. సెక్యులరిజం విజేతలం తామే అని భావించేవారిని సంతృప్తి పరచడానికి చేయలేదని, భారత ముస్లింలు దేశభక్తి, అభిమానాలు కలవారని చెప్పడానికే చేశారని భాజపా ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. భారత ముస్లింలను తీవ్రవాదంలోకి ఆకర్షించాలనుకునే తీవ్రవాదశక్తులకు మోడీ వ్యాఖ్యలు చెంపపెట్టు సమాధానమన్నారు. ప్రజలు సామాజిక, ఆర్థికంగా బలపడేలా మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇదే దేశవ్యాప్తంగా సానుకూల దృక్పథాన్ని, అభివృద్ధి వాతావరణాన్ని సృష్టిస్తుండగా కొన్ని శక్తులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని నఖ్వీ విమర్శించారు

Leave a Comment