నా జన్మదినాన్ని వేడుకగా జరపొద్దు

images (6)న్యూఢిల్లీ: తన జన్మదినాన్ని వేడుకగా జరపవద్దని ప్రధాని మోడీ.. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులను కోరారు. దాని బదులు వారి సమయాన్ని, వనరులను వరదలతో కష్టాల్లో ఉన్న జమ్మూకాశ్మీరుకు వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 17న దేశవ్యాప్తంగా ఆయన 64వ జన్మదినోత్సవాన్ని జరిపేందుకు యోచిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ”నా జన్మదినం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నట్లు విన్నాను. జన్మదినాన్ని జరపవద్దని నేను సవినయంగా కోరుతున్నాను. జమ్మూకాశ్మీరులోని మన సోదరసోదరీమణులకు అండగా నిలబడాల్సిన సమయమిది.” అని మోడీ అన్నారు. ఈ నెల 17న మోడీ గుజరాత్‌లో ఉంటారు. తన తల్లి హీరాబా ఆశీస్సులు తీసుకుంటారు.

Leave a Comment