ముందే బయల్దేరుతున్న మోడీ

downloadన్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఒకరోజు ముందుగానే అమెరికా బయల్దేరుతున్నారు. జర్మనీలో నైట్ ల్యాండింగ్ మీద ఆంక్షలు ఉండటంతో ప్రయాణ సౌలభ్యం కోసం ఆయన ఒకరోజు ముందే వెళ్తున్నారు. వాస్తవానికి ఈనెల 26వ తేదీన బయల్దేరాలని ప్రధాని అనుకున్నా, 25నే బయల్దేరి, ముందు అనుకున్న షెడ్యూలు కంటే 5గంటలు ముందుగా సెప్టెంబర్ 26న న్యూయార్క్ చేరుకుంటారు. ముందుగా ఆయన 27వ తేదీ ఉదయం 9/11 స్మారక స్థలం వద్దకు వెళ్తారు.

మోడీ వెళ్లే ఎయిరిండియా విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఆగి, ఆ తర్వాత అక్కడినుంచి అమెరికాకు వెళ్తుంది. రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు విమానాలు ఫ్రాంక్ఫర్ట్లో దిగడానికి గానీ, అక్కడినుంచి ఎగరడానికి గానీ వీల్లేదు. రాత్రిపూట తమకు విమానాల శబ్దం ఇబ్బందిగా ఉందని చుట్టుపక్కల ఉండే స్థానికులు ఫిర్యాదు చేయడంతో 2011 నుంచి ఈ చర్య తీసుకున్నారు.

29, 30 తేదీలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను వైట్హౌస్లో మోడీ కలుసుకుంటారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభకు హాజరై, ఆ తర్వాత వాషింగ్టన్ డీసీ చేరుకుంటారు.

Leave a Comment