దేశ సేవకు మీ నైపుణ్యాలు వినియోగించండి :మోడీ

imagesన్యూఢిల్లీ: దేశ సేవకు ఇంజినీర్లు తమ నైపుణ్యాలను వినియోగించాలని ప్రధాన మంత్రి మోడీ కోరారు. నూతన ఆవిష్కరణలు, కఠోర శ్రమ, అత్యాధునిక సాంకేతికతతో ప్రపంచంలోనే మన ఇంజినీరింగ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. దేశ సేవకు ఇంజినీర్లు తమ సేవల్ని కొనసాగించాలని కోరారు. సోమవారం ప్రఖ్యాత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మోడీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారతరత్న పురస్కారగ్రహీత ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా సెప్టెంబరు 15న ‘ఇంజినీర్ల దినోత్సవం’ జరుపుతున్నారు.


 

Leave a Comment