ప్రణబ్ ముఖర్జీతో నరేంద్ర మోడీ భేటీ

imagesన్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాష్ట్రపతితో ప్రధాని చర్చించినట్టు సమాచారం. అయితే వీరి భేటికి సంబంధించి రాష్ట్రపతిభవన్ కానీ, ప్రధాని కార్యాలయం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

భారీ వరదలు అతలాకుతలం చేసిన జమ్మూకాశ్మీర్ లో చేపట్టిన సహాయక చర్యల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారని తెలుస్తోంది. జపాన్ పర్యటన, ఆస్ట్రేలియాతో అణు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రణబ్ ను మోడీ కలిశారు.

Leave a Comment