న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా దేశవ్యాప్త అజెండా కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. భారత్‌ను 2019 వరకు పరిశుభ్ర దేశంగా మార్చాలనే లక్ష్యంతో అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు. ఇందుకోసం తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. అక్టోబర్ 2న చేపట్టే కార్యక్రమాలు రాజధానిలో ప్రధానమంత్రి వేడుకలకే పరిమితం చేయొద్దని మోడీ పేర్కొన్నారు. దేశంలోని అన్ని గ్రామాల్లోనూ చేపట్టాలని, దీన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని నొక్కిచెప్పారు. స్వచ్ఛ్ భారత్‌కు గాంధీజీని మనం స్ఫూర్తిగా తీసుకోవాలని మోడీ తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం పరిశుభ్ర ప్రమాణాలను రూపొందించాలన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో గంగా, దాని ఉపనదుల తీరంలో ఉన్న పట్టణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Recent Comments