వివేకానందుని సందేశం ఆచరణీయం: ప్రధాని

imagesన్యూఢిల్లీ: స్వామీ వివేకానందుని విశ్వమానవ సౌభ్రాతృత్వ సందేశం ఎల్లప్పుడు ఆచరణీయమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ వివేకానందుని సిద్ధాంతాలు అనుసరించి ఉన్నట్లయితే..అమెరికాలో చోటుచేసుకున్న 9/11 వంటి ఉగ్రవాద దాడులు జరిగి ఉండేవికావని పేర్కొన్నారు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన సదస్సులో వివేకానందుడు విశ్వమానవ సౌభ్రాతృత్వ సందేశాన్ని వినిపించారని మోడీ గుర్తుచేశారు. వివేకానందుని సందేశాన్ని గుర్తుచేసుకొని..ప్రతి ఒక్కరు ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, ప్రపంచశాంతికి కృషిచేయాలని సూచించారు.

Leave a Comment