కొనసాగుతున్న కుండపోత

61406831148_625x300నాసిక్‌లో ఇద్దరు మృతి
 నాసిక్: పుణే, ఠాణేలతోపాటు నాసిక్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. పట్టణంలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారమందింది. పథార్ది-ఫాటా ప్రాంతంలో కాంపౌండ్ గోడ కూలిన దుర్ఘటనలో రమేశ్ యాదవ్ అనే కూలీ మృతిచెందగా, త్రైంబకేశ్వర్ తాలూకాలోని తల్వాడే-అంజనేరి గ్రామంలో రోడ్డు దాటుతూ సునీతా చవాన్ అనే మహిళ నీళ్లలో కొట్టుకుపోయి మృతిచెందిందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 660.30 మిల్లీమీటర్ల వర్షం కురిసిట్లు వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

ఇగత్‌పురిలో 138 మిల్లీమీటర్ల, త్రైంబకేశ్వర్‌లో 128 మిల్లీమీటర్లు, పీంట్‌లో 100 మిల్లీమీటర్ల, నాసిక్ పట్టణంలో 70 మిట్లీమీటర్ల వర్షపాతం నమోదైట్లు చెప్పారు. ఇటు ముంబైలో కూడా వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఘాట్కోపర్, కుర్లా, చెంబూర్, హింద్‌మాతా తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. పుణేలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ యార్డు పూర్తిగా నీటమునిగింది. ముంబైలో కూడా కొండచరియలు విరిగి పడ్డాయి.

Leave a Comment