త్వరలో జాతీయ గృహ నిర్మాణ పథకం

images (3)న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించేందుకు సమీకృత జాతీయ గృహనిర్మాణ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. యూపీఏ హయాం నాటి రాజీవ్ అవాస్ యోజన,  జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తదితర పథకాలను విలీనం చేసి ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తెస్తామన్నారు.

వెంకయ్య శుక్రవారమిక్కడ ప్రారంభమైన జాతీయ స్థిరాస్తి వ్యాపార అభివృద్ధి మండలి రెండు రోజుల సదస్సులో మాట్లాడారు. మంచి ఇల్లు అనేది గౌరవ ప్రద జీవనానికి మౌలిక లక్షణమని పేర్కొన్నారు. 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల కుటుంబాలను కలుపుకుని మొత్తం 10 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో తక్కువ ధరకే ఇళ్లు నిర్మిస్తామన్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణలో అడ్డంకులు తొలగస్తామని, అవసరమైన అనుమతులను వేగంగా ఇచ్చేందుకు కృష్టి చేస్తామని చెప్పారు.

Leave a Comment