నెయ్‌మార్ ఒంటరయ్యాడు..!

images (4)బెజిల్ స్టార్ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ ఒంటరయ్యాడు. తన ప్రేయసి బ్రూనా మార్క్వెజీన్‌తో బంధాన్ని తెంచుకున్నాడు. త్వరగా పెళ్లి చేసుకుని పిల్లలను కందామని బ్రూనా ఒత్తిడి చేయడమే.. విడిపోవడానికి కారణమట. అంత త్వరగా ఎందుకని నెయ్‌మార్ వారించినా ఆమె వినకుండా.. ఏకంగా బ్రెజిల్ టీవీలో ప్రకటన చేసేసింది. ”నేను నా భర్తతో ఉంటాను. ఇద్దరు పిల్లలకు తల్లినవుతా. తల్లిని కావడమే నా అతిపెద్ద కల” అని బ్రూనా చెప్పింది. నిజానికి నిరుడే వీళ్లిద్దరి మధ్య ప్రేమ బంధం తెగింది. ఐతే ప్రపంచకప్ ముందు తిరిగి ఒక్కటయ్యారు. ప్రపంచకప్ ముగిశాక ఆమె నెయ్‌మార్‌తో కలిసి స్పెయిన్‌లోని ఇబిజాకూ వెళ్లింది. నెయ్‌మార్‌తో విభేధాలొచ్చి ఆమె ఇబిజా నుంచి వెళ్లిపోగానే నెయ్‌మార్ పార్టీల్లో మునిగిపోవడం.. అతడి పాత ప్రేయసి గ్రాబియెల్లా లెంజి అక్కడికి చేరుకోవడం విశేషం.