మణి చిత్రంలో నిత్య?

 images (5)మణిరత్నం చిత్రం చూసి రెండేళ్లు దాటిపోయింది. ఈ ప్రఖ్యాత దర్శకుడు తదుపరి చిత్రానికి ప్రయత్నాలు మొదలెట్టి కూడా ఏడాదిన్నర పైనే అయ్యిం ది. మణిరత్నం తదుపరి చిత్రానికి ఇంత గ్యాప్ రావడం, ఇంత చర్చ జరగడం బహుశ ఇప్పుడే కావచ్చు. కారణాలేమైనా ఆయన తాజా చిత్రం సెట్ కావడానికి ఈ సారి ఎక్కువ సమయమే పట్టింది. మొదట టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, మహేష్‌బాబు, ఐశ్వర్యరాయ్, శ్రతిహాసన్‌లతో తమిళ, తెలుగు భాషల్లో భారీ మల్టీస్టార్ చిత్రం తీయాలని సంకల్పించారు.
 
 ఆ తరువాత ఆ ప్రయత్నం వర్క్‌అవుట్ కాలేదు. తొలుత తెలుగులో చిత్రం తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఆ చిత్రం అటకెక్కింది. ఆ తరువాత మణిరత్నం అలప్పాయదే చిత్రం తరహాలో ఒక యూత్‌ఫుల్ చిత్రం చే యనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ సూపర్ హీరో కమలహాసన్ కుమార్తె శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు న్యూస్‌హాట్‌గా ప్రచారమైంది.
 
 ఇటీవల బాలీవుడ్ బ్యూటీ అనియాభట్ మణిరత్నం తాజా చిత్రం హీరోయిన్ ప్రచారం ఊదరగొట్టారు. తాజాగా మలయాళకుట్టి నిత్యామీనన్‌ను మణిరత్నం చిత్రంలో నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇలా మణిరత్నం తాజా చిత్రం గురించి ఎవరికి తెలిసింది వారు ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఆయన మాత్రం గుంభనంగా అన్నీ గమనిస్తూనే తనపని తాను చేసుకుపోవడం గమనార్హం.
 

Leave a Comment