నిరాశపడొద్దు

images (4)బెంగళూరు: ఉప ఎన్నికల్లో అనూహ్యంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ ఫలితా లు చూసి నిరాశపడాల్సిన అవసరం లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ‘‘ఈ ఉప ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకోకండి.4రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధిస్తుంది.

కాంగ్రెస్ రహిత భారత్‌ను సాధించే దిశగా ముందడుగు వేస్తాం.’’ అని ఆయన అన్నా రు. బుధవారం కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని గోర్తా గ్రామంలో సర్దార్ పటేల్ విగ్రహానికి, అమర వీరుల స్థూపానికి శంకుస్థాపన చేసారు.‘‘కొన్నిచోట్ల బీజేపీ ఓటమికి ప్రతిపక్షాలు సంబరపడుతున్నాయి. అస్సాంలో, బెంగాల్‌లో మేం ఖాతా తెరిచిన అంశాన్ని వారుగమనించడంలేదు’’ అని అన్నారు.

Leave a Comment