‘కూలిన విమానంలో భారతీయులు లేరు’

71403247020_625x300న్యూఢిల్లీ: కూలిపోయిన మలేషియా విమానంలో భారతీయులు లేరని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన విమానసిబ్బంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో కూలిపోయిన విమానం బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. ఇందులోని సమాచారం ఆధారంగా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకోనున్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌ మీదుగా విమాన రాకపోకలను విమానసంస్థలు నిలిపేశాయి. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతి చెందారు.
 

Leave a Comment