షారుక్‌తో నో ప్రాబ్లమ్

Shahrukh Khanమూవీ.. బజ్: బాలీవుడ్ సింగమ్ అజయ్‌దేవగణ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. తనకు, కింగ్ ఖాన్ షారుక్‌తో ఎలాంటి విభేదాలు లేవని బల్ల గుద్ది మరీ చె బుతున్నాడు. ఆ ప్రచారమంతా ట్రాష్ అని కొట్టిపారేశాడు. అజయ్ ‘సన్నాఫ్ సర్దార్’, షారుక్ ‘జబ్ తక్ హై జాన్’ 2012లో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో జరిగిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కెరీర్‌కు కొత్త రూపు
మోడలింగ్ నుంచి వెండితెరపైకి వచ్చిన దీపానితాశర్మ.. ఇకపై చాలెంజింగ్ రోల్స్ చేస్తానని చెబుతోంది. 13 ఏళ్ల కెరీర్‌లో ‘దిల్ విల్ ప్యార్ వ్యార్’, ‘మై బ్రదర్.. నిఖిల్’, ‘జోడీ బ్రేక ర్స్’ వంటి సినిమాల్లో అందచందాలతో అదరగొట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రల్లో ఒదిగిపోతానంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్    ‘పిజ్జా’లో మానసిక సంఘర్షణకు గురయ్యే పాత్రకు ఓకే చెప్పింది.  

‘హంప్టీశర్మ…’ ఏక్‌దమ్

 డైరెక్టర్ కునాల్ కోహ్లీకి సక్సెస్ టాక్ మూటగట్టుకున్న ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా’ చిత్రం పిచ్చపిచ్చగా నచ్చిందట. హంప్టీ శర్మ.. అవుట్ స్టాండింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అంటూ ఆయన కితాబిచ్చేశాడు. స్పెషల్ ప్రీమియర్ షో చూసిన కునాల్.. శశాంక్ ఖైతాన్ డెరైక్షన్.. ఆలియా, వరుణ్ జోడీ… అన్నీ అదిరిపోయాయంటూ సినిమాకు ఫుల్ రేటి ంగ్స్ ఇచ్చేశాడు.

Leave a Comment