ఆనంద్-కార్ల్‌సన్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువు

51407529627_625x300ట్రోమ్‌సో (నార్వే): విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య నవంబర్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు స్పాన్సర్లు కరువయ్యారు. ఈ నేపథ్యంలో తాను అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది నిర్వహిస్తానని రష్యా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ తెలిపారు.
 
ఈ సోమవారం నార్వేలో జరిగే ‘ఫిడే’ ఎన్నికల్లో గ్యారీకి పోటీగా కిర్సాన్ ఇల్యుమ్‌జినోవ్ బరిలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం ఆనంద్, కార్ల్‌సన్ మ్యాచ్ రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. గతేడాది చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.14 కోట్లు లభించగా ఈసారి అది రూ.8 కోట్లకు తగ్గింది. ‘మూడు నెలల సమయమే ఉన్నా ఈ రీమ్యాచ్ కోసం స్పాన్సర్లు ఎవరూ లే రు. మరింత ప్రచారం చేయాల్సి ఉంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వచ్చే మార్చిలో నిర్వహిస్తా. ఎందుకంటే స్పాన్సరర్లకు తగిన సమయం కావాల్సి ఉంటుంది’ అని కాస్పరోవ్ అన్నారు.