NTR వర్శిటీ నిధులు ప్రభుత్వ స్వాధీనం

విజయవాడ:

NTR వర్శిటీ నిధులు ప్రభుత్వ స్వాధీనం

1986 సంవత్సరంలో స్థాపించబడిన NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం సొంత నిధులు ప్రభుత్వ ఖాతాలలోకి మళ్లించబడ్డాయి!

సంస్థపరంగా ఎటువంటి చర్చలు – తీర్మానాలు లేకుండానే వైస్ ఛాన్సలర్ ఏకపక్షంగా మళ్లించిన ఈ నిధులు మొత్తం ₹400 కోట్లు!

యూనివర్సిటీకి మొత్తం ₹448 కోట్ల మేర నిధులు ఉన్నాయని అది సంస్థ సిబ్బంది శ్రమతో దశాబ్దాలుగా కూడబెట్టిన సొమ్ము కాబట్టి సంస్థ ఆధీనంలోనే ఉండాలనే డిమాండ్ తో ఉద్యోగులు సమ్మెకు దిగబోతున్నారు.

గతంలో కూడా ఈ సంస్థ నిధుల కోసం ప్రభుత్వం రంగంలోకి దిగినప్పుడు వివాదం చెలరేగటంతో సర్కార్ వెనక్కి తగ్గటం గమనార్హం.

నవంబర్ 9 వ తారీఖు “ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్” NTR వర్సిటీకి నిధులు బాదలాయించమనే సారాంశంతో ఒక లేఖ రావటంతో ఈ కధ మొదలయ్యింది.

అప్పట్లో,  కొత్త  ప్రభుత్వం రాగానే వైస్ ఛాన్సలర్ పదవి అంశంలో ఘర్షనాత్మక వాతావరణం ఏర్పడి చివరికి పి. శ్యామ్ ప్రసాద్ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పుడు సంస్థ నిబంధనలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, టెండర్ ప్రక్రియ తదితర వ్యవహారాలన్నీ పక్కనపెట్టేసి ఇష్టారాజ్యంగా ముందుకువెళ్లారని ఉద్యోగులు మండిపడుతున్నారు.

ప్రస్తుతం కెనరా బ్యాంక్ లో ఉన్న ₹400 కోట్లు ఫిక్సుడ్ డిపాజిట్ లు మరొక సంవత్సరం గడిస్తే మెచ్యూరిటీ స్థాయికి చేరుకుని ₹43 కోట్ల వడ్డీని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా కూడా,.ఆ అవకాశాన్ని వృధా చేస్తూ నిధులు బ్యాంక్ నుండీ వెనక్కి తీసేసుకుంటామని పత్రాలు సమర్పించేశారు!   

కాగా, ప్రభుత్వం 5.5% వడ్డీ ఇస్తామని చెపుతుండగా,..G.O. నం. 25తో బ్యాంక్ ల్లోని ప్రభుత్వరంగ నిధులకు భద్రత లేదని,.ఇప్పుడు అసలుకి బధ్రత భద్రత ఏమిటని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.   

ఏటా యూనివర్సిటీ నిర్వాహణకు ₹70  నుండీ ₹80 కోట్లు ఖర్చు ఔతుండగా ప్రభుత్వం కేవలం ₹5 కోట్లు గ్రాంట్ ఇచ్చి చేతులు దులుపుకోంటోందని సమాచారం!

చివరకు విద్యార్ధుల పరీక్షలకూ రూపాయి ఇవ్వని ప్రభుత్వం వర్శిటీ జేబు నుండీ సొమ్ము ఎలా తీసుకుంటుందనేది ఉద్యోగుల ప్రశ్న?

ఈ మొత్తం ఘటనలో  వైస్ ఛాన్సలర్ & రిజిస్ట్రార్ ఒక వైపు – వర్శిటీలో ఉన్న 2 యూనియన్లు, సిబ్బంది మరొకవైపు చేరిన సన్నివేశంలో,.విధులను బాయ్ కాట్ చేస్తున్నట్లు సిబ్బంది ప్రకటించారు.

ఈ అనిశ్చితితో వచ్చే సంవత్సరం నుండీ యూనివర్సిటీ నిర్వాహణ – ఉనికి  ప్రశ్నార్ధకంగా మారబోతున్నాయా అనేది వేచిచూడాలి…  

~ విశ్వ ~

Leave a Comment