ఐఎస్ఐఎస్‌ను తుడిచివేస్తాం: ఒబామా

images (3)వాషింగ్టన్: ఇరాక్, సిరియాల్లోని సాయుధ సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) పీచమణిచేందుకు… ఉగ్రవాద నిరోధక వ్యూహాలతో నిరంతర పోరు సాగిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా శపథం చేశారు. ఆ ఉగ్రవాద సంస్థను క్షీణింపజేసి, చివరికి దాని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. ఈ మేరకు గురువారం ఆయన శ్వేతసౌధం నుంచి 15 నిమిషాల పాటు అధికార టీవీ కార్యక్రమంలో మాట్లాడారు. ఇరాక్, సిరియాల్లోని అత్యధిక ప్రాంతాలపై పట్టు సాధించి, ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న ఉగ్రవాదులను మట్టబెట్టేందుకు… అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ కూటమిలో దాదాపు 24 దేశాలు భాగస్వామ్యమైనట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడైనా తమ పౌరులకు హాని తలపెట్టేవారికి… నిలువ నీడ లేకుండా చేస్తామని హెచ్చరించారు.

Leave a Comment