పాక్ విపక్షాల నిరసన హింసాత్మకం

71409513623_625x300ప్రధాని ఇంటి ముట్టడికి ఆందోళనకారుల యత్నం

లాఠిచార్జీ, రబ్బరు బుల్లెట్లు
ముగ్గురి మృతి…500 వుందికి గాయూలు


ఇస్లావూబాద్:
 పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దెదిగాలనే డిమాండ్‌తో దేశంలో గత 18 రోజులుగా జరుగుతున్న విపక్షాల నిరసనలు శనివారం రాత్రి హింసాత్మకంగా మారాయి. మాజీ క్రికెటర్, తెహ్రికే ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్, కెనడాకు చెందిన త పెద్ద, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ చీఫ్ తహిరుల్ ఖాద్రీ నాయకత్వంలో మద్దతుదారులు కర్రలు చేతబూని  ఇస్లామాబాద్‌లోని ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. లాఠిచార్జీ చేయడంతోపాటు బాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఇరుపక్షాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా 500 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు జర్నలిస్టులున్నారు.
 
అయితే భద్రతా దళాల దాడిలో తమ పార్టీకి చెందిన ఏడుగురు మృతి చెందినట్టు ఖాద్రీ ఆరోపించారు. కాగా, పోలీసుల ఉక్కుపాదంపై మండిపడ్డ ఇమ్రాన్.. నిరంకుశ ప్రభుత్వం బారి నుంచి ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకు పోరాడే క్రమంలో మరణించేందుకైనా సిద్ధమన్నారు. ఈ ఆందోళనలు ఇమ్రాన్ పార్టీలో చిచ్చురేపాయి.  ప్రధాని ఇంటి ముట్టడిని విమర్శించినందుకు ఏకంగా పార్టీ చీఫ్ హష్మీతోపాటు ముగ్గురు ఎంపీలను ఇమ్రాన్ బహిష్కరించారు. మరోపక్క.. ప్రభుత్వం, సైన్యం  వేర్వేరుగా అత్యవసర సమావేశం నిర్వహించాయి.