పాకిస్థానీ స్మగ్లర్కు మరణశిక్ష

images (8)రియాద్ : భారీ మొత్తంలో హెరాయిన్ స్మగ్లింగ్ చేసినందుకు ఓ పాకిస్థానీ వ్యక్తికి సౌదీ అరేబియాలో మరణశిక్ష విధించి, అమలుచేశారు. కమ్రాన్ గులాం అబ్బాస్ అనే వ్యక్తి సౌదీలోని తూర్పు రాష్ట్రంలో భారీ మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఖోబర్ గవర్నరేట్లో అతడికి మంగళవారం నాడు మరణ శిక్ష అమలు చేసినట్లు చెప్పారు.

జనరల్ కోర్టులో అబ్బాస్ నేరం రుజువైంది. సుప్రీంకోర్టు కూడా ఈ శిక్షను ధ్రువీకరించింది. డ్రగ్స్ అమ్మకాలపై సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్దులాజిజ్ సౌద్ గట్టిగా దృష్టిసారించారు. కేవలం వ్యక్తులనే కాక సమాజం మొత్తాన్ని ఇవి నాశనం చేస్తాయని, ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే వాళ్లను షరియా ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించినట్లు హోం శాఖ తెలిపింది.

Leave a Comment