అత్యాచార కేసు నుంచి పింకికి విముక్తి

download (4)కోల్‌కత: ఆసియా క్రీడల స్వర్ణ విజేత పింకి ప్రమాణిక్‌కు వూరట! పింకిపై ఉన్న అత్యాచార కేసును కొట్టి వేస్తూ.. ఆమెను నిర్దోషిగా ప్రకటించింది కోల్‌కత హైకోర్టు. పింకి మహిళ కాదని.. తనతో ఆమెకు శారీరక సంబంధం ఉందని ఓ మహిళ రెండేళ్ల క్రితం కేసు పెట్టింది. పోలీసులు పింకిని అరెస్టు చేసి అత్యాచార, చీటింగ్ కేసులు నమోదు చేశారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పింకికు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించగా.. న్యాయమూర్తి ఆమెను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఫలితం తేడా వస్తే.. పింకి గెలిచిన పతకాలన్నీ వెనక్కివ్వాల్సి వచ్చేది.

Leave a Comment