(డీఎఫ్‌ఐడీ) ప్రాథమిక సర్వే స్పష్టం

images (3)సమాజంలో ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా 37 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ (డీఎఫ్‌ఐడీ) ప్రాథమిక సర్వే స్పష్టం చేసింది. బాల్య వివాహాలతో చిరు ప్రాయంలోనే 39 శాతం మంది  తల్లులు కూడా అవుతున్నట్లు వెల్లడైంది.

సోవువారం అమీర్‌పేటలోని ‘సెస్’ హాలులో  చిన్నారుల జీవన స్థితిగతులపై చేపట్టిన రెండు రాష్ట్రాల సర్వే నివేదికలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాన్సలర్ ప్రొఫెసెర్ హనుమంతరావు, తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసెర్ రత్నకుమారి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ యువజన స్ఫూర్తికి విరుద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లోని మూడో వంతు నిరుపేదలు చదువుకోవాల్సిన వయసులోనే స్వయం ఉపాధి వేటలో పడుతున్నారని వెల్లడించారు.

12 ఏళ్లలోపు చిన్నారుల్లో 40 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. బాలలకు పౌష్టికాహారం అందకనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతుతున్నాయని తమ అధ్యయనంలో వెల్లడైందన్నారు. బాలలకు విద్య, పౌష్టికాహారం అందించే విషయంపై పంచాయతీ స్థాయిలలో గ్రామసభల ద్వారా అవగాహన కల్పించాలని హనుమంతరావు సూచించారు. స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేదన్నారు.

చిన్నారుల పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై యూకేలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ (డీఎఫ్‌ఐడీ) ప్రాథమిక సర్వే నిర్వహించగా, యూనివ ర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్(హైదరాబాద్), పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) సమన్వయకర్తగా వ్యవహరించాయి. విద్య, పోషకాహారం, ఆరోగ్యం, యువజనాభివృద్ధి వంటి ప్రధానాంశాలను యంగ్‌లైవ్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ డెరైక్టర్ ప్రొఫెసర్ జో బెడైన్, సెస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ రాధాకృష్ణ, సెస్ డెరైక్టర్ ప్రొఫెసర్ గాలబ్, డాక్టర్ రేణుసింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Comment