తల్లి నిర్జీవం.. గర్భంలో బిడ్డ సజీవం

71406404897_625x300కళ్లు తెరవకుండానే ఓ చిన్నారి కన్న తల్లికి దూరమైంది. సరైన సమయంలో వైద్యులు అందించిన సాయంతో ఆ శిశువు అమ్మలేని లోటుతో కళ్లు తెరచుకుంది. శుక్రవారం సెంట్రల్ గాజాలోని దీర్ అల్ బలాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు గర్భంతో ఉన్న 23 ఏళ్ల మహిళ కన్నుమూసింది. అయితే, సకాలంలో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె గర్భంలో ఉన్న శిశువును క్షేమంగా బయటకు తీశారు.
 
ఇక, కాల్పులకు తాత్కాలిక విరామంతో గాజాలోని పలు ప్రాంతాల్లో కొందరు పూర్తిగా నేలమట్టమైన తమ ఇళ్లను చూసి బోరున విలపించారు. పాలస్తీనాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని వివిధ శిబిరాల్లో 1.18 లక్షల మంది తలదాచుకుంటుండగా… ఆహార కొరత సమస్య నెలకొంది.

 

Leave a Comment