రామ్‌చరణ్, కాజల్ హార్డ్వర్క్

51406608219_625x300హిట్ ఫెయిర్ రామ్‌చరణ్, కాజల్ హ్యాట్రిక్ విజయం కోసం తెగ కష్టబడుతున్నారు. ‘గోవిందుడు అందరి వాడేలే’లో మూడోసారి జంటగా నడిస్తున్న వీరిద్దరూ మరో సక్సెస్ పై గురిపెట్టారు. అంచనాలు అందుకునేందుకు తగు విధంగా కష్టపడుతున్నారు. అంతేకాదు తామేలా కష్టపడుతున్నామో చూడండి అంటూ కాజల్ తన ఫేస్బుక్ పేజీలో ఒక ఫోటో పెట్టింది. జిమ్ లో తనతో పాటు రాంచరణ్, దర్శకుడు కృష్ణవంశీ కసరత్తులు చేస్తున్న ఫోటోను షేర్ చేసింది. చరణ్ తో మగధీర, నాయక్ సినిమాల్లో కాజల్ జతకట్టిన సంగతి తెలిసిందే.

ఇక సోమవారం(సోమవారం 28) కృష్ణవంశీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. తన సృజనాత్మక అభ్యాసంలో ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని ప్రశంసించింది. ఆయన గతంలో చేసిన చందమామ, ఇప్పుడు చేస్తున్న సినిమా మరిచిపోలేని అనుభూతులని పేర్కొంది. ఆయనతో కలిసి పనిచేయడం తనకెప్పుడూ ఉత్సాహంగా ఉంటుందని చెప్పింది. కృష్ణవంశీతో కలిసి కాఫీ తాగుతున్న ఫోటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకుంది.

Leave a Comment