ప్రతీకారంతో రగిలిపోయి … సామూహిక అత్యాచారం

downloadలక్నో: తమ తరఫు అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని బాధితురాలు బంధువులు ఆగ్రహాంతో రగలిపోయారు. తమ అమ్మాయికి జరిగినట్లే ఆ నిందితుడి సోదరిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని బాధితురాలి బంధువులు సమయం కోసం ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది… అత్యాచార నిందితుడి ఇంట్లో అతడి సోదరి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను ఐదుగురు యువకులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు అక్కడి నుంచి పరారీ కావడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆ ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లో చోటు చేసుకుంది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఐదుగురు నిందితుల్లో ఓ నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. అయితే అత్యాచారానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని కుమ్హేడ బ్రిడ్జ్ వద్దకు చేరుకుంది. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను ఇంటికి తీసువెళ్లారు. కాగా ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. నిరసనగా కక్క్రౌలీ పోలీసు స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో నిందితులను అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దాంతో వారు ఆందోళన విరమించారు.