మార్లిన్ మన్రో ఫొటో!

download (1)లండన్ : శృంగార దేవత మార్లిన్ మన్రో ఫొటోలంటే అభిమానులకు ఎప్పుడైనా క్రేజే. అలాంటిది ఆమె అరుదైన ఫొటో అంటే అసలు ఆగుతారా? అసలు సినిమాల్లోకి రాకముందు మార్లిన్ మన్రో తీయించుకున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను వేలానికి పెట్టగా.. దానికి ఏకంగా 4 లక్షల రూపాయలకు పైగా ధర పలికింది. 1946లో ఏజెన్సీ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ జస్గర్ ఈ ఫొటో తీశారు.

మార్లిన్ మన్రో తొలిసారి మోడలింగ్ చేసినప్పుడు కాలిఫోర్నియాలోని జుమా బీచ్లో ఈ ఫొటో తీసి ఉంటారని భావిస్తున్నారు. దీని ఫొటో మాత్రమే 4 లక్షలు పలకగా.. దాని నెగెటివ్, కాపీరైట్ లాంటివి మరోసారి అమ్మకానికి పెట్టబోతున్నారు. వాటికి రెట్టింపు ధర పలకవచ్చని అంచనా వేస్తున్నారు.

Leave a Comment