రెండేళ్ల ప్రథమ పౌరుడు

51403850070_625x300న్యూఢిల్లీ: నేటితో రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ(78) రెండేళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ రెండేళ్లలో గత రాష్ట్రపతులకు భిన్నంగా.. ఎక్కువ కాలం రాష్ట్రపతి భవన్‌లోనే గడిపేందుకు ప్రణబ్ ఆసక్తి చూపారు. ప్రణబ్ కన్నా ముందు రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభాపాటిల్ తన ఐదేళ్ల పదవీకాలంలో రూ. 223 కోట్ల ఖర్చుతో 23 దేశాలను సందర్శించి వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ మాత్రం ఈ రెండేళ్లలో బెల్జియం, టర్కీ, దక్షిణాఫ్రికాల్లో మాత్రమే పర్యటించారు.
 
అలా అని ఆయన దౌత్య మర్యాదలను తక్కువ చేయలేం. ఈ రెండేళ్లలో ఆయన జపాన్ చక్రవర్తి సహా 75 మంది విదేశీ ప్రముఖులకు రాష్ట్రపతిభవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవం కూడా రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలోనే జరిగిన విషయం ఇక్కడ గమనార్హం. విదేశీ అతిధుల కోసం ఇక్కడి వంటవారికి వివిధ దేశాల వంటకాలను వండటంలో ప్రణబ్ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.

Leave a Comment