శాస్త్రి మాటలే స్ఫూర్తిగా

suresh rainaకార్టిఫ్: రెండో వన్డేలో భారత్ విజయానికి కారణం టీమ్ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి కారణమని అంటున్నాడు సురేశ్ రైనా. అతని మాటలే జట్టులో స్ఫూర్తిని నింపాయని అంటున్నాడు. ” వన్డేకు ముందు జట్టు సమావేశంలో రవిశాస్త్రి మాట్లాడాడు. అతని మాటలు స్ఫూర్తి రగిలించేలా ఉన్నాయి. స్టేడియంకు వెళ్లేటప్పుడు కూడా బస్సులో శాస్త్రి నా పక్కనే కూర్చున్నాడు. మాజీ ఆటగాళ్లతోనైతే స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చు జట్టులో కోచ్‌లు కూడా సహకరిస్తున్నారు గానీ.. రవిశాస్త్రి జట్టులో విశ్వాసాన్ని నింపాడు” అని రైనా అన్నాడు.