మరో ఛానెల్ కథ కంచికి

downloadవివిధ రాజకీయ కారణాలతో, ఆ వ్యవహారాల పట్ల అపరిపక్వ జ్ఞానంతో చానెళ్లు ప్రారంభించడం, తరువాత పళ్ల బిగువున నష్టాలతో నడిపించడం, ఆఖరికి మూత పెట్టడం మామూలైపోయింది. ఇప్పుడు ఆ లైన్ లోకి మరో చానెల్ వచ్చేసింది. ఆర్ వి ఎస్ చానెల్ ప్రసారాలు గడచిన రెండురోజులుగా రావడం లేదని తెలిసింది. ఆఫీసుకు తాళం పడినట్లు మీడియా సర్కిళ్లలో చెప్పుకుంటున్నరు.  ఈ చానెల్ ను చిరకాలంగా బోలెడు నష్టాలతో అలా అలా నడిపించుకుంటూ వస్తున్నారు. ఆఖరికి ఇక చేతులు ఎత్తేసినట్లు తెలిసింది. దీని వల్ల బోలెడు మంది ఉద్యోగులు రోడ్డున పడాల్సి వస్తుంది. గతంలో జీ న్యూస్ ఇలాగే మూత పడింది. ఇప్పటికే దాదాపు తొంభై తోమ్మిది శాతం చానెళ్లు నష్టాల్లో వున్నాయి. మూత పడే చానెళ్ల జాబితా కాస్త పెద్దదిగానే వుంది.  అయితే మూత పడితే రూపాయి కూడా రాదు. ఎవరో ఒకరికి అమ్మితే కాస్తయినా వస్తుంది. కానీ కొనేవారే కనిపించడం లేదు. అందునా ఎన్నికలు మరో అయిదేళ్ల వరకు లేవు కాబట్టి, రాజకీయ అవసరాలకు చానెళ్లుమేపడం అన్నది చాలా కష్టం కూడా.

Leave a Comment