రెజీనా డ్రెస్ కేరాఫ్ వాట్స్ ఆప్

imagesరెజీనా ఇప్పుడు తెలుగునాట డిమాండ్ పెంచుకుంటున్న అప్ కమింగ్ హీరోయిన్. రెజీనా డ్రెస్ సెన్స్ బాగుంటుందని, ఇప్పుడిప్పుడే టాక్ వస్తోంది. పవర్ సినిమాలో ఆమె డ్రెస్ లు బాగున్నాయని, సమంత నిన్న మొన్నటిదాకా ఇలాగే మంచి మంచి క్లాస్ టచ్ డ్రస్ ల్లో అలరించేదని అందరూ గుర్తు చేసుకున్నారు. ఇంతకీ రెజీనా డ్రెస్ సెన్స్ వెనుక సీక్రెట్ వాట్స్ ఆప్ అని తెలిసింది.  అదేంటా అంటారా..సెట్ లో డ్రెస్ ఫలానా అని యూనిట్ జనాలు చెప్పగానే, అలాగే అని ఓ ఫొటొ తీసి వాట్స్ ఆప్ లో తన ఫ్రెండ్స్ గ్రూప్ లో అప్ లోడ్ చేస్తుందట. వెంటనే ఆ ఫ్రెండ్స్ అంతా సమాధానం పంపుతారట. నచ్చిందీ..నచ్చలేనిదీ..కనీసం పదికి ఆరుగురైనా ఓకె అంటే సరే లేదంటే సారీ చెప్పి, డ్రెస్ మార్చమని అడుగుతుందట. గెటప్ మీద ఆ మాత్రం శ్రద్ధ వుండాలి మరి.

Leave a Comment