కొలతల శారీలో హాట్‌ బ్యూటీ

images (2)శివ మనసులో శృతి’ (ఎస్‌ఎంఎస్‌) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రెజినా, టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ‘పవర్‌’ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా కన్పించిందీమె. నటన పరంగా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న రెజీనాకి గ్లామర్‌ ప్రదర్శించడంలోనూ మంచి మార్కులే పడ్తున్నాయి. సినిమాల్లో గ్లామర్‌ అటుంచితే, రెజినా ఏ సినిమా కార్యక్రమానికి హాజరైనా డ్రెస్సింగ్‌ స్టయిల్‌ విషయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుటోంది. తాజాగా ఓ సినీ కార్యక్రమంలో పాల్గొన్న రెజీనా.. ఇదిగో ఇలా హాట్‌ హాట్‌గా కన్పించింది. ట్రాన్స్‌పరెంట్‌ శారీలో గ్లామర్‌ ఒలకబోసేసింది. అంతేనా, ఈ శారీకి ఓ ప్రత్యేకత వుందండోయ్‌. ఆ ప్రత్యేకత ఏంటో అర్థమయ్యిందా.? అదేనండీ ఆమె శారీ మీద ‘కొలతలు’ వున్నాయి. టేప్‌ని గుర్తుకు తెచ్చేలా శారీని భలేగా డిజైన్‌ చేశారు కదా. అన్నట్టు, ఫంక్షన్లకు వచ్చేటప్పుడు డ్రెస్సింగ్‌ స్టయిల్‌ విషయంలో రెజినా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటుందట. అందుకే మరి.. ఆమె అందరిలోనూ ప్రత్యేకంగా కన్పిస్తుంటుంది.

Leave a Comment