మణికట్టుపై కోసుకొని, ఉరివేసుకున్న రాబిన్ విలియమ్స్

41407945974_625x300లాస్ ఏంజెలిస్: ప్రఖ్యాత హాలీవుడ్ హాస్యనటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63)ది ఆత్మహత్యేనని మారిన్ కౌంటీ షెరిఫ్ అధికారి తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు సమీపంలోని టిబురోన్లోని తన ఇంట్లో విలియమ్స్ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఆయన తన ఎడమచేతి మణికట్టును చిన్న చాకుతో పలుసార్లు కోసుకున్నట్లు తెలిపారు. చేతిపై రక్తపు గాట్లు ఉన్నట్లు చెప్పారు.  ఆ తరువాత విలియమ్స్ బెల్టుతో ఉరి కూడా వేసుకున్నట్లు వివరించారు. విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో అతని భార్య  సునాన్ స్కీనిడెర్ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె మరో గదిలో నిద్రిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన తరువాత పనిమీద ఆమె బయటకు వెళ్లారు. తన భర్త నిద్రిస్తున్నట్లుగా ఆమె భావించారు. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో ఇంటి పనిమనిషి వచ్చనప్పుడు విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

రాబిన్ విలియమ్స్  ఇంతకు ముందు ఉన్న ఇంటి వద్ద, అతను నటించిన సినిమాలలో చిత్రీకరించిన ప్రదేశాలలో పూలగుచ్చాలు ఉంచి అభిమానులు నివాళులర్పించారు. బోస్టోన్స్ పబ్లిక్ గార్డెన్స్లోని ఒక బెంచ్ వద్ద అతనిని స్మరిస్తూ  పూలు ఉంచి నివాళులర్పించారు. గుర్తుగా ఫొటోలు కూడా తీసుకున్నారు. గుడ్విల్ హంటింగ్ చిత్రంలో ఒక సన్నివేశాన్ని ఇక్కడ షూట్ చేశారు. ఆఫ్గనిస్తాన్లో విలియమ్స్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను అతని జ్ఞాపకార్థం అమెరికా రక్షణ శాఖ విడుదల చేసింది.