ఆర్టీసీకి రూ. 250 కోట్లు విడుదల

images (5)హైదరాబాద్: ఆర్టీసీకి రూ. 250 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీలకు సంబంధించిన ఆ మొత్తాన్ని నాన్-పాన్ కింద విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. కార్మికులకు చెందిన వివిధ పొదపు పథకాల నిధులను ఆర్టీసీ వినియోగించుకుంది. ఆర్థిక సమస్యల కారణంగా దసరా పండుగ బోగస్ కూడా ఇవ్వలేని స్థితికి ఆర్టీసీ దిగజారింది. ఈ పరిణామాలపై కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయటంతోపాటు ప్రభుత్వానికి వినతులు చేశాయి. ప్రభుత్వం రూ. 250 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. ఉత్తర్వులు జారీ చేయటంలో జాప్యమవుతుండటంతో కార్మిక సంఘాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల నకలును రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) నాయకులకు అందచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, మహేందర్‌రెడ్డిలకు ఆర్టీసీ టీఎంయూ నేతలు అశ్వథామరెడ్డి, కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Comment