విమాన ఇంజన్ లో దాక్కున్నాడు!

61407410774_625x300మాస్కో:ఇప్పటికే విమాన ప్రమాదాలతో ప్రయాణికులు ఆందోళన చెందుతుంటే.. విమానంలో తాజాగా మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. రష్యాకు చెందిన జెట్ లైనర్ విమానంలో ఓ వ్యక్తి ఇంజన్ లో దాక్కుని ప్రయాణించిన ఘటన కలకలం రేపింది. కెమిరోవా నగరం నుంచి బయల్దేరిన జెట్ లైనర్ విమానం హుర్ ఘడా వద్ద ల్యాండ్ అయిన అనంతరం ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. అక్కడ్నుంచి మరొక చోటుకి విమానాన్ని సిద్ధం చేసే క్రమంలో ఓ వ్యక్తి ఇంజన్ లో ఉండటాన్ని రష్యా కార్మికులు గుర్తించి అధికారులకు తెలియజేశారు.

దీంతో అతన్ని విమాన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఎటువంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. అసలు విమాన ఇంజిన్ లోకి ఎలా వెళ్లాడనే దానిపై కూడా వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నందువల్ల అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.