సచిన్ ఆత్మకథ ఆవిష్కరణ నవంబరు 6న

images (6)న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ ఆత్మకథ నవంబరు 6న మార్కెట్లోకి రాబోతోంది. అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ పుస్తకాన్ని ఆ రోజు ఆవిష్కరించబోతున్నారు. పాత్రికేయుడు బోరియా మజుందార్ పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించాడు. ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ శీర్షికతో ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా ముద్రిస్తున్నారు. ”నా ఆత్మకథ రాయాలంటే నేను క్రికెట్ ఆడిన రీతిలోనే పూర్తిగా నిజాయితీగా ఉండాలని నాకు తెలుసు. ప్రజలతో పంచుకోని అనేక అంశాల్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరచాల్సివుంది” అని సచిన్ ఓ ప్రకటనలో చెప్పాడు. పుస్తకం ముఖపత్రంపై సచిన్ వాంఖడేలో చివరిసారి వెస్టిండీస్‌పై టెస్టు ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన తర్వాత మైదానం నుంచి వెళ్తూ బ్యాట్ ఎత్తి అభివాదం చేసే చిత్రాన్ని ముద్రించారు.